HomeTelugu Trending'నారప్ప' గా వెంకటేశ్‌ .. ఫస్ట్‌లుక్‌

‘నారప్ప’ గా వెంకటేశ్‌ .. ఫస్ట్‌లుక్‌

1 19
తమిళ స్టార్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘అసురన్‌’ తెలుగు రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న.. ఈ సినిమాకు ‘నారప్ప’ టైటిల్‌ ప్రకటించారు. అంతేకాదు సినిమాలో వెంకీ లుక్స్‌ కూడా విడుదల చేశారు. ఆ లుక్‌లో వెంకటేశ్‌ ఊరమాస్‌గా కనిపిస్తున్నాడు. తొలుత సినిమాకు సంబంధించిన వివరాలు మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ అంతకంటే ముందుగానే సినిమా నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్‌తో పాటు వెంకటేశ్‌ లుక్స్‌ అదిరిపోయాయని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్లు, ఇతర నటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది. కాగా ‘అసురన్‌’ సినిమాలో ధనుష్‌ హీరోగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu