HomeTelugu Trendingబాలయ్య నెక్స్ట్ గెస్ట్‌గా నాని

బాలయ్య నెక్స్ట్ గెస్ట్‌గా నాని

Balakrishna unstoppable sec
ఆహాలో ‘అన్ స్టాపబుల్’షోకి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో ఫస్ట్‌ ఎపిసోడ్‌కి బాలయ్య, మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి విదితమే. మోహన్ బాబు ను నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నాడు. కొన్ని మాటలు, కొన్ని ఆటలతో బాలయ్య హంగామా షో కే వన్నెతెచ్చాయి. ఇక రెండో ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని సందడి చేయనున్నాడు.

నాని తో బాలకృష్ణ సెట్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఆహా సంస్థ విడుదల చేసింది. “మనలో ఒకడు.. సెల్ఫ్ నేమ్ కి సర్ నేమ్ .. నేచురల్ స్టార్ నాని మన నెక్స్ట్ గెస్ట్” అని తెలుపుతూ ఈ ఎపిసోడ్ ప్రోమోను ఈ రోజు 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రోమో కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu