HomeTelugu Trendingఅల్లు అర్జున్‌కి బాలకృష్ణ విషెస్‌

అల్లు అర్జున్‌కి బాలకృష్ణ విషెస్‌

Balakrishna wishes for Allu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో సోషల్‌ మీడియా ద్వారా అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. అల్లు అర్జున్‌కు అవార్డు వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. తెలుగు సినిమా దేశ విదేశాల్లో సత్తా చాటడం సంతోషకరమని తెలిపారు. విదేశీయులు కూడా తెలుగు సినిమా చూసే స్థాయికి రావడం హర్షణీయమని అన్నారు.

‘సోదరుడు అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు రావడం అనేది.. ఓ నటుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. మా నటులందరికీ అదొక గర్వకారణం. ఆర్ఆర్ఆర్ సినిమాకు 6 అవార్డులు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌‌ అవార్డు సాధించింది. ఉప్పెన చిత్రానికీ జాతీయ అవార్డు వచ్చింది. అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’అని చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!