
Aamir Khan 60th Birthday Celebrations:
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్ ఈ ఏడాది మార్చి 14న తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే తాజాగా మాషబుల్ ఇండియా కోసం ‘ది బాంబే జర్నీ’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆ రోజు తనకు ఏమీ గుర్తు లేదని చెప్పాడు. కారణం మాత్రం షాక్‌కు గురిచేసేలా ఉంది — మద్యం మత్తు!
అమిర్ చెప్పినట్లుగా, “నా కుటుంబం నాకు పెద్ద సర్‌ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. సాధారణంగా నేను మద్యం ఎక్కువగా తాగను. కానీ ఆ రోజు నా 60వ పుట్టినరోజు కావడంతో అందరూ ఒక్క గ్లాస్ తాగమంటూ ఒత్తిడి పెట్టారు. మొదట ఓకే అన్నా. కానీ ఒకసారి ప్రారంభించాక నేను బ్రేక్ పెట్టను. నా శరీరం మద్యం తాగే అలవాటు లేకపోవడంతో త్వరగా హ్యాంగ్ అవ్వాను. రాత్రి 7 గంటలకి పార్టీ స్టార్ట్ అయింది. 9 గంటలకి నేను పూర్తిగా మత్తులోకి వెళ్లిపోయాను.”
అతను మరింతగా చెప్పాడు, “ఇది మొదటిసారి కాదు. నాకు ఇలా గతంలోనూ జరిగింది. మరుసటి రోజు లేవగానే ఆ రాత్రి ఏమి జరిగిందో ఏమి గుర్తుండలేదు. వాళ్లు ఫొటోలు, వీడియోలు చూపించగా అందులో నేను అందరితో ఎలా మాట్లాడానో చూసాను కానీ ఏమీ గుర్తు రాలేదు. అన్నీ బ్లాక్ ఔట్ అయిపోయాయి. ఎవరితో ఎలా స్పందించాను, ఎవరు ఏమన్నారో కూడా గుర్తుండదు.”
ప్రస్తుతం అమిర్ ఖాన్ తన తదుపరి చిత్రం సితారే జమీన్ పర్ విడుదలకు సిద్ధమవుతున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పానిష్ మూవీ కాంపియోన్స్ కి రీమేక్‌గా తెరకెక్కింది. జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.
ALSO READ: Mythri Movie Makers వేసిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఏంటంటే..