బాలయ్య కోసం ఎన్టీఆర్ ను పిలవలేదు!

ఇటీవల మోహన్ బాబు 40 వసంతాల వేడుక విశాఖపట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
రాజకీయ, సినీప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, వెంకటేష్, దాసరి వంటి వారు వచ్చారు.
అయితే బాలయ్య బాబు మాత్రం ఎక్కడా కనిపించలేదు. నిజానికి బాలకృష్ణ కు మోహన్ బాబు
కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. మోహన్ బాబు స్వయంగా బాలకృష్ణను ఈ కార్యక్రమానికి
ఆహ్వానించారు. అయితే బాలకృష్ణ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన హాజరు కాలేకపోయారు.
అయితే జూనియర్ కు మాత్రం అసలు ఆహ్వానమే అందలేదట. దానికి కారణం బాలయ్యనే
అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి
తెలిసిందే. బాలయ్య ఉండే కార్యక్రమంలో ఎన్టీఆర్ ఉండడం ఆయనకు ఇబ్బందిగా ఉంటుందని
భావించిన మోహన్ బాబు ఏకంగా ఎన్టీఆర్ ను పిలవడం మానేశాడు. తీరా చూస్తే బాలకృష్ణ
కార్యక్రమానికి హాజరు కాలేదు. నందమూరి హీరోలు లేక కార్యక్రమంలో కాస్త కల తగ్గిందనే
చెప్పాలి.

CLICK HERE!! For the aha Latest Updates