బాలయ్య ‘రైతు’ చిత్రం సెట్స్ పైకి!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా
షూటింగ్ నవంబర్ నాటికి పూర్తవుతుంది. దీని తరువాత చిత్రంగా బాలయ్య ‘రైతు’ అనే సినిమాను
చేయాలని భావిస్తున్నాడు. నిజానికి బాలయ్య 100వ చిత్రంగా ‘రైతు’ సినిమా చేయాల్సివుంది.
కానీ క్రిష్ చెప్పిన శాతకర్ణి కథ ప్రామిసింగ్ గా అనిపించడంతో రైతు కథను పక్కన పెట్టేశాడు.
ఇప్పుడు శాతకర్ణి షూటింగ్ పూర్తవుతున్న తరుణంలో ‘రైతు’ సినిమాను పట్టాలెక్కించడానికి
ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్ట్ చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే
ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని చెబుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను ఆరంభించి డిసంబర్
నెలలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో
ఓ మైలు రాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates