HomeTelugu Trending'బంగార్రాజు' మూవీ టీజర్‌

‘బంగార్రాజు’ మూవీ టీజర్‌

Bangarraju Teaser

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. సూపర్‌ హిట్‌ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున పంచెకట్టులో, నాగ చైతన్య స్టైలిష్ గా కన్పించారు. ‘బంగార్రాజు’ లాగే చిన ‘బంగార్రాజు’ కూడా సోగ్గాడే. కృతి శెట్టి గ్రామ సర్పంచ్ ఆమెను ఆకట్టుకోవడానికి చై ఆమెను దేశానికి సర్పంచ్‌గా చేస్తానని చెప్పిన సన్నివేశంతో పాటు అన్ని సీన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఇక టీజర్ లో నాగ్, రమ్యకృష్ణ జోడి, చై, కృతి కెమిస్ట్రీ అదిరిపోయింది.

టీజర్‌లో విజువల్స్ తో పాటు మంచి యాక్షన్ డోస్ కూడా చూపించారు మేకర్స్. వీడియోలో యమ ధర్మరాజుగా కనిపించాడు నాగబాబు. టీజర్ ద్వారా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనే విషయాన్నీ మేకర్స్ స్పష్టం చేశారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరొక హైలెట్. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu