HomeTelugu Big Storiesనాగ చైతన్య బర్త్‌డే స్పెషల్‌ 'బంగార్రాజు' టీజర్‌ వచ్చేసింది

నాగ చైతన్య బర్త్‌డే స్పెషల్‌ ‘బంగార్రాజు’ టీజర్‌ వచ్చేసింది

naga chaitanya teaser from
అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్‌కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘బంగార్రాజు’. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. మంగళవారం చైతూ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే సినిమాను సిద్ధం చేసినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. అక్కినేని అభిమానులు కోరుకునే అన్ని హంగులతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు.

సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా చిత్రాన్ని శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ సినిమాలో నాగర్జునకు జంటగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతూకి జోడీగా నాగలక్ష్మి అనే పాత్రలో కృతి శెట్టి కనిపించనుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu