HomeTelugu Trendingబంగార్రాజు నుండి 'లడ్డుండా' సాంగ్‌ వచ్చేసింది

బంగార్రాజు నుండి ‘లడ్డుండా’ సాంగ్‌ వచ్చేసింది

Laddunda Lyrical song from
అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “బంగార్రాజు”. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా “లడ్డుండా” అనే మాస్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను నాగార్జున స్వయంగా పాడాడు. నాగ్ సరదాగా ఈ సాంగ్ ను పాడినప్పటికీ తన గాత్రంతో ఈ సాంగ్ స్టైల్‌గా మారింది. మొదట్లో ఆయన చెప్పిన గోదావరి యాస డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. “లడ్డుండా” పాటను నాగ్ తో పాటు చిత్రంలోని రంభ, ఊర్వశి, మేనకలపై చిత్రీకరించారు. సాంగ్ లో నాగ్ ట్రేడ్‌మార్క్ పంచెకట్టు హైలైట్.

ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల రచించిన ఈ సాంగ్ కు ధనుంజయ్, మోహన బోగరాజు, నూతన మోహన్, హరిప్రియ అదనపు గాత్రాన్ని అందించారు. సంగీత స్వరకర్త అనూప్ రూబెన్స్ మరోసారి సూపర్ సౌండ్‌ట్రాక్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. “బంగార్రాజు” కొత్త షెడ్యూల్ ఈ రోజు మైసూర్‌లో ప్రారంభమైంది. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమాలో కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!