HomeTelugu Big Storiesకౌబోయ్‌ లుక్‌లో 'అల్లుడు' అదుర్స్

కౌబోయ్‌ లుక్‌లో ‘అల్లుడు’ అదుర్స్

Bellamkonda as a Cowboy Wit
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ నివాస్‌.. కందిరీగ హైపర్ సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ పనులు ప్రారంభించారు మేకర్స్. కాగా జనవరి3 న బెల్లంకొండ హీరో పుట్టినరోజు సందర్బంగా.. ఈ అల్లుడు అదుర్స్ సినిమాలో నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేయనుంది చిత్రబృందం. ‘ఓలా చిక్కా’ అంటూ సాగే ఈ సాంగ్ లో శ్రీనివాస్ కౌబోయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు. హీరోయిన్ నభా నటేష్ కౌగర్ల్ లుక్కులో మెరిసిపోతుంది. ఇద్దరూ కూడా ఓలా చిక్కా పాటలో అల్ట్రా స్టైలిష్ లుక్కులో డాన్స్ ఆదరగొట్టారని టాక్. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ ఈ ఐటమ్‌ సాంగ్‌ చేనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అను ఇమ్మానుయేల్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu