HomeTelugu Reviewsమహా సముద్రం మూవీ రివ్యూ

మహా సముద్రం మూవీ రివ్యూ

Maha Samudram Movie Review

అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన రెండోవ చిత్రం ‘మహా సముద్రం’. ఈ సినిమాలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన రావడంతో ‘మహా సముద్రం’ పై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ: వైజాగ్‌ నగరానికి చెందిన అర్జున్‌(శర్వానంద్‌), విజయ్‌(సిద్ధార్థ్‌) ఇద్దరు ప్రాణ స్నేహితులు. అర్జున్‌ ఏదైనా బిజినెస్‌ ప్రారంభించడానికి ప్రయత్నించగా, విజయ్‌ మాత్రం పోలీసు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు మహాలక్ష్మీ అలియాస్‌ మహా(అదితిరావు హైదరీ)తో ప్రేమలో ఉంటాడు విజయ్‌. పోలీసు ఉద్యోగం సంపాదించాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అర్జున్‌ లైఫ్‌లోకి అనుకోకుండా వస్తుంది లా స్టూడెంట్‌ స్మిత(అను ఇమ్మాన్యుయేల్‌). ఈ క్రమంలో వరుసగా జరిగే కొన్ని సంఘటనల వల్ల విజయ్‌ వైజాగ్‌ సిటీ నుంచి పారిపోవాల్సి వస్తుంది.

అతని ఆచూకీ కోసం అర్జున్‌ ఎంత వెతికిన ప్రయోజనం ఉండదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత పారిపోయిన విజయ్‌ తిరిగి మళ్లీ వైజాగ్‌కు వస్తాడు. అప్పటికీ అర్జున్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌గా ఎదుగుతాడు. అసలు విజయ్‌ వైజాగ్‌ సిటీని వదిలి ఎందుకు పారిపోయాడు? బిజినెస్‌ చేయాలనుకునే అర్జున్‌ స్మగ్లింగ్‌, డ్రగ్స్‌ దందాను ఎందుకు ఎంచుకున్నాడు? ప్రాణ స్నేహితులైన అర్జున్‌, విజయ్‌ శత్రువులుగా ఎలా మారారు? విజయ్‌ ప్రాణంగా ప్రేమించిన మహాకు ఎలాంటిపరిస్థితులు ఎదురయ్యాయి? ఆ సమయంలో అర్జున్‌ ఎలా తోడుగా నిలిచాడు అనేదే కథలోని అంశం.

Maha Samudram Movie Review3

నటీనటులు:
శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. శర్వానంద్ కెరీర్‌లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీలో మహా పాత్రలో అదితిరావు హైదరి ఒదిగిపోయింది. అందంతో పాటు చక్కటి అభినయంతో ప్రేక్షకుల మనసును దోచుకుంది. అను ఇమ్మాన్యుయేల్ పర్వాలేదనిపించింది. శర్వా, సిద్ధూల తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్రలు.. జగపతి బాబు, రావు రమేశ్‌లవి. చుంచూ మామ పాత్రలో జగపతి బాబు పరకాయ ప్రవేశం చేశారు. కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పది అని నమ్మే గూని బాబ్జీ క్యారెక్టర్‌లో రావు రమేశ్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. విలన్‌ ధనుంజయ్‌గా రామచంద్ర రాజు తన పాత్రకు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

విశ్లేషణ:
‘ఆర్‌ఎక్స్‌ 100’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మహా సముద్రం’ రెండో సినిమాకే భారీ కథను, అందుకు తగ్గట్లు నటీనటులను ఎంచుకున్నాడు. పాత్రలతో తాను అనుకున్న పాయింట్ ని చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశాడు. మొదటి భాగంలో ఎక్కువగా పాత్రల పరిచయానికే సమయం కేటాయించాడు. గూని బాబ్జీగా రావు రమేశ్‌ ఎంటర్‌ అయ్యాక కథ పరుగులు తీసుస్తుంది. ఫస్టాఫ్‌ అంత సోసోగా నడిపించిన దర్శకుడు.. ఇంటర్వెల్ పాయింట్ కి పీక్ టైంకి తీసుకొచ్చి, ఓ ఫైట్‌ సీన్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరిగేలా చేశాడు.

కానీ రెండోవ భాగంలో ఆ అంచనాలను తగ్గట్లు కాకుండా వేరే ట్రాక్ తీసుకుని వెళుతుంది. సెకండాఫ్‌ కి వచ్చేసరికి దర్శకుడు పూర్తిగా ఎమోషన్స్ మీదకి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఎమోషన్స్‌ తెరపై అంతగా వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

maha samudram

టైటిల్‌ : : మహా సముద్రం
నటీనటులు : శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌, రావు రమేశ్‌, జగపతిబాబు తదితరులు
నిర్మాత : సుంక‌ర రామ‌బ్ర‌హ్మం
దర్శకత్వం అజయ్ భూపతి
సంగీతం : చేతన్‌ భరద్వాజ్

హైలైట్స్‌‌: శర్వానంద్‌, సిద్ధార్థ్ న‌ట‌న‌
డ్రాబ్యాక్స్‌‌: సెకండాఫ్‌

చివరిగా: పర్వలేదు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu