అలరించే కీర్తి సోయగం!

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకుంది అలనాటి మహానటి సావిత్రి. ఈ నటి జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో కొన్ని కీలక ఘట్టాలపై హోమ్ వర్క్ చేసిన దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కోలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి
తెలిసిందే.

అయితే ఈ సినిమాలో కీర్తి లుక్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. విశాలవంతమైన నుదురుపై ఎరుపు రంగు బొట్టు, కళ్ళకు కాటుక, వాలు జడను కొప్పుగా మలిచి 80ల కాలం నాటి హీరోయిన్ మాదిరి ఆభరణాలు ధరించి వెరైటీ లుక్ తో కుందనపు బొమ్మలా తయారైంది కీర్తి. ఈ సినిమాలో కీర్తితో పాటు స్టార్ హీరోయిన్ సమంత కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మరో ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు.