టాక్ ఆఫ్ ది టౌన్‌: బేతాళుడు!

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో
విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ  సినిమాలతో విభిన్న చిత్రాల హీరొగా  పేరు తెచ్చుకున్న విజయ్ ,
బిచ్చ‌గాడు తో  స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు.  ఓ వైపు సంగీత ద‌ర్శ‌కుడిగా బిజీగా
ఉంటూనే హీరోగా త‌న‌ని తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకున్న ఆంటోని .. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ
మార్కెట్లో హాట్ టాపిక్‌ గా మారిపొయాడు. అత‌డు న‌టించిన సినిమా వ‌స్తోంది అంటేనే అదో అటెన్షన్.
‘బిచ్చ‌గాడు’ చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న విజ‌య్ ఆంటోని ఎంచుకునే క‌థ‌ల్లో సంథింగ్
స్పెషాలిటి ఆడియెన్‌కి విప‌రీతంగా న‌చ్చుతోంది. మరొపక్క అత‌డు త‌న‌కు తానే ఓ బ్రాండ్‌గా ఆవిష్క‌రించుకున్న
తీరు మార్కెట్ వ‌ర్గాల‌కు న‌చ్చుతోంది. అందుకే విజయ్  న‌టించిన `భేతాళుడు` చిత్రానికి త‌మిళ్‌, తెలుగు
మార్కెట్ల‌లో అసాధార‌ణ క్రేజు నెల‌కొంది. అస‌లు ఆంటోని ఓ సినిమాలో న‌టిస్తున్నాడు అంటేనే బ‌య్య‌ర్లు,
డిస్ట్రిబ్యూట‌ర్లు ఫ్యాన్సీ ఎమోంట్ లను ఆఫర్ చెస్తున్నారంటే  అతిశ‌యోక్తి కకాదు. భేతాళుడు ఫ‌స్ట్‌లుక్
పోస్ట‌ర్లు, ట్రైల‌ర్స్ తో పాటు తొలి పది నిమిషాల సినిమాని కూడా ఆడియెన్స్ కు ముందుగానే చూపించారంటేనే
విజయ్ ఈ సినిమా విజయం పై ఎంత కాన్పిడెన్స్ తో ఉన్నారో అర్దం చేసుకోవచ్చు.