HomeTelugu Newsదర్శకుడు కావాలనే కోరిక తీరింది: శ్రీనివాసరెడ్డి

దర్శకుడు కావాలనే కోరిక తీరింది: శ్రీనివాసరెడ్డి

19నటులు శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్‌ ప్రధాన పాత్రల్లో ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా కమెడియన్‌, నటుడు వై.శ్రీనివాస్‌ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఈనెల 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా బ్యానర్‌ లోగోను అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. టైటిల్‌ యానిమేషన్‌ను ఎస్‌.ఎస్‌.థమన్‌ ఆవిష్కరించారు. ఫ్లయింగ్‌ కలర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమా పూర్తిగా హాస్యభరిత చిత్రం. మా సినిమా చూసిన వారు గంటన్నర సేపు పడి పడి నవ్వుతారు.. ఆ విషయంలో నాది గ్యారెంటీ. నో యాక్షన్‌, నో సెంటిమెంట్‌ .. ఓన్లీ కామెడీ’ అని దర్శక నిర్మాత శ్రీనివాసరెడ్డి అన్నారు. ముందుగా ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే చేద్దామని అనుకున్నాను. కానీ వేరే డైరెక్టర్‌ను పెట్టినా ఆయన వెనక ఏమైందంటూ నేను నిలబడాల్సి వస్తుంది. దీంతో నేనే డైరెక్ట్‌ చేశాను. దర్శకుడిని కావాలనే నా కోరిక అలా తీరింది అన్నారు. సినిమా చూసిన దిల్‌రాజు, శిరీష్‌, సాయి సహా కొంతమంది చిన్న చిన్న కరెక్షన్స్‌ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్‌ అయింది అన్నారు. ‘ఈ సినిమా విషయంలో శ్రీనివాసరెడ్డి కేవలం భాగ్యనగర వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ గమ్మత్తు చేస్తారనడంలో సందేహం లేదు. గట్టిగా నవ్విస్తారు.. చాలా క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించార’ని మరో నిర్మాత పద్మనాభరెడ్డి అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu