HomeTelugu Newsస్వీయ గృహనిర్బంధంలోకి మంత్రి హరీశ్‌రావు

స్వీయ గృహనిర్బంధంలోకి మంత్రి హరీశ్‌రావు

1 11
తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసంలోకి స్వీయ గృహనిర్బంధంలోకి వెళ్లారు. సిద్దిపేటలో ఆయన నివాసంలోని వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో మంత్రితో పాటు 17 మందికి నెగెటివ్‌ వచ్చింది. మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu