HomeTelugu Big Storiesఆచార్య: 'సానా కష్టం వచ్చిందే మందాకినీ' సాంగ్‌ విడుదల

ఆచార్య: ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ సాంగ్‌ విడుదల

Saana Kastam Lyrical from A

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘లాహే లాహే, ‘నీలాంబరి’ పాటలు విశేషంగా అలరించాయి. ఇప్పుడా జాబితాలోకి మరో పాట వచ్చి చేరింది. ఈ సినిమాలోని ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే ప్రత్యేక గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. మణిశర్మ సంగీతం, చిరంజీవి స్టెప్పులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటలో చిరుకి జోడీగా రెజీనా సందడి చేసింది. భాస్కరభట్ల రవికుమార్‌ రచించిన ఈ పాటను రేవంత్‌, గీతామాధురి ఆలపించారు.

దేవాదాయ శాఖ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌.. సిద్ధ అనే కీలక పాత్ర పోషించారు. చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌కు జంటగా పూజాహెగ్డే నటించారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడెక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదలకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu