Homeపొలిటికల్అంకిత భావం.. నిస్వార్థ సేవకు గౌరవం.. భారతరత్నపై అద్వానీ స్పందన

అంకిత భావం.. నిస్వార్థ సేవకు గౌరవం.. భారతరత్నపై అద్వానీ స్పందన

Advani2

భారతీయ జనతా పార్టీలో అగ్రనేత, కురు వృద్ధుడు ఎల్‌.కే. అద్వానీకి భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా ప్రజలకు చేరువై ప్రజానేతగా పేరుతెచ్చుకున్నారు అద్వానీ. దేశంలో కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు అవిరళ కృషి చేసిన మహానేత అద్వానీ. కీర్తి ప్రతిష్టలతో పాటు అపవాదులను సైతం మూటకట్టుకున్న ఉద్యమ కారుడు అద్వానీ. పార్టీతో పాటు ఎదిగి ఉప ప్రధాని అయ్యారు.

తనకు భారత రత్న పురస్కారం వరించడంపై గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు. ఇది తనకు ఓ వ్యక్తిగా దక్కిన గౌరవం కాదని, తన జీవితంలో శక్తిమేరకు సేవ చేయడానికి ఆచరించిన ఆదర్శాలు, సూత్రాలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. నాకు అప్పగించిన ప్రతి పనినీ దేశం కోసం అంకిత భావంతో, నిస్వార్థంగా సేవ చేశానని అన్నారు.

1990లో అద్వానీ చేపట్టిన రామ రథయాత్ర బీజేపీకి బాగా కలిసొచ్చింది. 1992లో బాబ్రీ విధ్వంసం.. బీజేపీని ముందుగా యూపీలో అధికారంలోకి తెచ్చింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారానికి దగ్గర చేసింది. 1984లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ పార్టీ అద్వానీ, వాజ్‌పేయి ఆధ్వర్యంలో 161 స్థానాలకు ఎదిగి అతిపెద్ద పార్టీగా అవతరించింది.

బీజేపీని అధికారంలోకి తేవడానికి అద్వానీ ఎన్నో యాత్రలు చేశారు. దేశానికి ప్రధాని కావాలనేది ఆయన కల. అది నెరవేరకుండానే రాజకీయాలనుంచి తప్పుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu