HomeTelugu Trendingరానా బర్త్‌డే స్పెషల్‌.. 'భీమ్లా నాయక్' అప్డేట్‌

రానా బర్త్‌డే స్పెషల్‌.. ‘భీమ్లా నాయక్’ అప్డేట్‌

Bheemla nayak movie update
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఈ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రేక్షకులు ఎంతతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం హీరో రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

రానా బర్త్‌డే కానుకగా మంగళవారం సాయంత్రం 4:05 గంటలకు మరో అప్‌డేట్‌ను విడుదల చేస్తామని పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. డానియల్ శేఖర్‌తో ఎన్‌కౌంటర్‌కు సిద్ధంగా ఉండాలని పోస్ట్ చేసింది. సాగర్ కె.చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ రన్ టైమ్ 2 గంటల 57 నిమిషాలు కాగా దానిని ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే భీమ్లా నాయక్ మాత్రం ఒరిజినల్ వర్షన్ కంటే కాస్త తక్కువ రన్ టైమ్‌తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu