HomeTelugu TrendingBhimaa Trailer: నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊళ్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా!

Bhimaa Trailer: నేను ఊచకోత మొదలుపెడితే ఈ ఊళ్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా!

 

Bhimaa movie Trailer

Bhimaa Trailer: గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ మూవీకి కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హర్ష దర్శకత్వంలో హీరోలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంటారు.

అలాంటి దర్శకుడు గోపీచంద్ వంటి హీరోతో సినిమా చేస్తుంటే.. మాస్‌ ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు ఉంటాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈమూవీ ట్రైలర్‌ని విడుదల చేసారు.

ఈ ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు వైవిధ్యమైన పాత్రల్లో గోపీచంద్ కనిపిస్తున్నాడు. ఒక లుక్ లో పోలీస్ గా , ఇంకో లుక్ లో లాంగ్ హెయిర్ తో ఓల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ‘నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊళ్లో శ్మశానం కూడా సరిపోదు నా కొడకా..!’ అనే డైలాగ్ హైలెట్ గా ఉంది.

ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పోస్టుపోన్ అయ్యి మార్చి 8 శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాభవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu