భూమిక ఎలా మారిందో చూడండి!


భూమిక చావ్లా నటించిన ఒక్కడు సినిమా అప్పట్లో సూపర్ హిట్. ఆ తరువాత అనేక మంది హీరోల సరసన భూమికకు అవకాశాలు వచ్చిపడ్డాయి. టాలీవుడ్ లో భూమిక చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించింది. స్టార్ హీరోయిన్ గా పాపులర్‌ కాగానే యోగా గురు భరత్ ను వివాహం చేసుకుంది. వివాహం తరువాత భూమికకు పెద్దగా కలిసిరాలేదు. టాలీవుడ్ లో తనకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. సినిమా ప్రొడక్షన్స్ లో అడుగుపెట్టి కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ ప్రయోగాలు బెడిసికొట్టాయి. మ్యాగజైన్ రంగంలోకి అడుగుపెట్టినా కలిసిరాలేదు. దీంతో మళ్లీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది భూమిక.. ఎంసిఏ, యుటర్న్ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదనిపించాయి.

ప్రస్తుతం భూమిక కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందట. అందుకే ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు భూమిక వీలైనన్ని ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోవాలని ప్రయత్నాల్లో ఉందట. దానికి తగ్గట్టుగానే తనను తాను మార్చుకొని అల్ట్రా మోడ్రన్ గా మారిపోయింది. ప్రస్తుతం భూమికకు సంబంధించిన అల్ట్రా మోడ్రన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ ఫొటోలను చూశాక మన దర్శక నిర్మాతలు మంచి అవకాశాలు ఇస్తారేమో.