HomeTelugu NewsDhanush: ఆ స్టార్‌ హీరో వారి కొడుకే.. తేల్చేసిన కోర్టు!

Dhanush: ఆ స్టార్‌ హీరో వారి కొడుకే.. తేల్చేసిన కోర్టు!

Big relief for Dhanush in p
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కోర్టులో ఊరట లభించింది. గత కొంతకాలంగా కదిరేశన్, మీనాక్షి అనే జంట.. ధనుష్ మా కొడుకు అంటూ.. న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెల్సిందే. 2016లో మధురై మేలూరు కోర్టులో ఈ కేసు ప్రారంభమైది. సినిమాలపై ఆసక్తితో ధనుష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని, ఎప్పటినుంచో వెతుక్కుంటూ వస్తే.. ఇప్పుడు దొరికాడని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తాము జీవించడానికి నెలకు రూ 65 వేలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ధనుష్ మాత్రం వారు తమ అమ్మానాన్న కాదని, తన తల్లిదండ్రులు కస్తూరి రాజా, విజయలక్ష్మి అని, తన నుంచి డబ్బులు రాబట్టేందుకే తప్పుడు కేసు పెట్టారని ధనుష్ కూడా చెప్తూ వచ్చాడు. దాదాపు 9 ఏళ్లుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. ఈక్రమంలో తాజాగా ఈ కేసును కోర్టు కొట్టివేసింది.

కదిరేశన్, మీనాక్షి చూపించిన ఆధారాలు సరైనవి కాదని తేల్చి చెప్పింది. గతంలో వారు కోర్టుకు అందించిన పిటిషన్ లో ధనుష్ కు ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల గురించి రాయడంతో.. ధనుష్ ను చెక్ చేయడానికి కోర్టు అనుమతించింది. ఇక ఈ మధ్యనే కోర్టు రిజిస్టార్‌ సమక్షంలో మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టుమచ్చలను చెక్ చేసారు.

అతని ఒంటిపై ఎలాంటి పుట్టుమచ్చలు లేవని తెలిపాడు. దీంతో కోర్టు.. కదిరేశన్, మీనాక్షి చెప్తున్న మాటలో నిజం లేదని తెలుపుతూ.. ఈ కేసును కొట్టివేసింది. ధనుష్.. కస్తూరి రాజా, విజయలక్ష్మి కొడుకే అని చెప్పుకొచ్చింది. ఇక ఈ కోర్టు తీర్పుతో ధనుష్ కు ఊరట లభించింది. మరి ఈ తీర్పుతో కదిరేశన్, మీనాక్షి జంట ఆగిపోతారో.. పై కోర్టులో కేసు వేస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!