HomeTelugu Trending'బంగార్రాజు' నుంచి మ్యూజికల్ పోస్టర్ విడుదల

‘బంగార్రాజు’ నుంచి మ్యూజికల్ పోస్టర్ విడుదల

Bangarraju movie update
టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో పిల్ల బంగార్రాజుగా నాగచైతన్య నటిస్తున్నారు. ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి మ్యూజికల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘నువ్వు పెళ్ళిచేసుకుని వెళ్లిపోతే బంగ్గారాజు .. మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు’ అంటూ ఈ పాట సాగుతోంది. ‘ది పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో ఈ పాట టీజర్ ను ఈ నెల 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.

‘జాతి రత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా పై ఈ పాటలో ఆడిపాడనున్నట్లు పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర కూడా చాలా ముఖ్యమైనదనే విషయం స్పష్టమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu