HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌ 50వ రోజు(సెప్టెంబర్ 9) హైలైట్స్‌

బిగ్‌బాస్‌ 50వ రోజు(సెప్టెంబర్ 9) హైలైట్స్‌

14 2

తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో 50 రోజుల సంబరాలు జరుపుకున్నారు. ఇప్పటి వరకూ జరిగిన హౌస్‌మేట్స్‌ జర్నీ చూపించాడు బిగ్‌బాస్‌. అయితే ఇది బిగ్‌బాస్‌ హౌస్‌ ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ వారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఎలిమినేషన్ బిగ్ బాస్ షోలో జరిగింది. ఈ సీజన్‌కు బలమైన కంటెస్టెంట్‌గా చెప్పుకుంటోన్న అలీ రెజా ఇంటి నుంచి బయటికి వచ్చేశారు.

ఏడోవారం ఎలిమినేషన్‌కు ఐదుగురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, శ్రీముఖి, మహేష్ విట్టా, రవికృష్ణ నామినేట్ అయ్యారు. అలీ నామినేట్ అవడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. అయితే, వీరిలో రాహుల్ సేఫ్ అయినట్టు శనివారం నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలింది అలీ రెజా, శ్రీముఖి, మహేష్, రవి. వీళ్లు నలుగురిలో అలీ రెజా ఎలిమినేట్ అవుతాడని హౌస్‌మేట్స్ కానీ, ప్రేక్షకులు కానీ ఊహించలేదు. కానీ, అదే జరిగింది. ప్రత్యేకమైన 50వ ఎపిసోడ్ రోజు బిగ్ బాస్ నమ్మలేని షాక్ ఇచ్చారు. కానీ, నమ్మితీరాలి.

అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున ప్రకటించడంతో హౌస్‌లో ఎవ్వరికీ సౌండ్ లేదు. మొదట శివజ్యోతి, హిమజ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి శివజ్యోతి, శ్రీముఖి, హిమజ ఏడుపు మొదలుపెట్టారు. ఒక్కరు ఇద్దరు కాదు.. రవి, రాహుల్, వరుణ్ సందేశ్ ఇలా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శ్రీముఖి, శివజ్యోతి అయితే వెక్కి వెక్కి ఏడ్చారు. ఎప్పుడూ స్ట్రాంగ్‌గా కనిపించే రాహుల్ అయితే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ఇప్పటి వరకు ఐదుగురు కంటెస్టెంట్లు బయటికి వెళ్లిపోయినప్పుడు కనిపించని వాతావరణం అలీ బయటికి వెళ్తుంటే కనిపించింది. అందరూ కన్నిటీతో సాగనంపారు.

అయితే, తొలిసారి నామినేట్ అయిన కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ఇది తొలిసారి కాదు. ఇదే షోలో రోహిణి, అషు రెడ్డి, తమన్నా తొలిసారి నామినేట్ అయ్యి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అలాగే, తొలి సీజన్‌లో ప్రిన్స్ తొలిసారి నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోయాడు. అయితే బిగ్‌బాస్‌ అలీకి హౌస్‌మేట్స్‌తో సీక్రెట్‌గా మాట్లాడే అవకాశం ఇచ్చాడు. దీని కోసం ఫోన్‌బూత్‌ ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కరితో పర్సనల్‌ గా మాట్లాడే అవకాశం ఇచ్చాడు. హౌస్‌మేట్స్‌ తన భావోద్వేగాన్ని అలీతో పంచుకున్నారు. బిగ్‌బాస్‌ తనకు ఇచ్చిన గంటసేపు జిమ్‌లో వర్కౌట్‌ చేయాలి అనే బిగ్‌బాంబ్‌ను అలీ తన ఫ్రెండ్‌ రవిపై విసిరాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu