విజయ్ సినిమా స్టైల్ లో మహేష్ మూవీ!

విజయ్ సినిమా స్టైల్ లో మహేష్ మూవీ!
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా కథ గురించి ఇప్పటివరకు 
ఎక్కడా రివీల్ కాలేదు. 100 కోట్ల బడ్జెట్ తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని
తప్ప మిగిలిన విషయాలను ఎక్కడా లీక్ కాకుండా చూసుకుంటున్నారు. అయితే ఈ సినిమా గతంలో 
విజయ్ నటించిన ‘తుపాకి’ సినిమా స్టయిల్ లో ఉంటుందని యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇది 
కూడా మురుగదాస్  డైరెక్ట్ చేసిన చిత్రమే.. తుపాకి సినిమా మాదిరినే మహేష్ బాబు టిపికల్ 
పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నాడు. తుపాకి సినిమా ఎంత స్టైలిష్ గా ప్రీ ప్లాన్డ్ గా ఉంటుందో.. 
ఇప్పుడు అదే స్టయిల్ లో పక్కా ఎనాలసిస్ తో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో మహేష్ సినిమా ఉంటుందని 
చెబుతున్నారు. ఇలాంటి కథలు మహేష్ కు బాగా సెట్ అవుతాయి. ఈ సినిమా గనుక క్లిక్ అయితే 
నిర్మాతలకు వసూళ్ళ వర్షం కురవడం ఖాయం. 
CLICK HERE!! For the aha Latest Updates