HomeTelugu Trendingబిగ్‌బాస్‌-3 విన్నర్‌ ఫొటో వైరల్‌

బిగ్‌బాస్‌-3 విన్నర్‌ ఫొటో వైరల్‌

1 1తెలుగు బిగ్‌బాస్‌ షో ఆఖరి అంకానికి చేరుకోవడంతో ఎవరు విజేతగా ఎవరు నిలుస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరు అన్న అంశంపై జనాలు బుర్ర బద్ధలు కొట్టుకునేలా ఆలోచిస్తున్నారు. వందరోజుల పోరాటానికి సెలవు పెట్టి కంటెస్టెంట్లు హాయిగా ఉండగా వారి అభిమానులు మాత్రం సోషల్‌ మీడియాలో కొట్టుకు చస్తున్నారు. కొంతమందైతే ఓ అడుగు ముందుకేసి అభిమానుల కోసం పాటలు, ర్యాలీలు, సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టారు. కొత్త తరహా ప్రచారాలు కూడా ఈ సీజన్‌లో తెరపైకి వచ్చాయి. బుల్లితెర సెలబ్రిటీలు కూడా తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్‌లకు ఓట్లు గుద్దండంటూ గళం వినిపించారు. శుక్రవారంతో ఓటింగ్‌ ముగియడంతో ప్రచారాలకు ముగింపు పలికిన ఫ్యాన్స్‌ గెలిచిన కంటెస్టెంట్‌ వీరే.. అంటూ మళ్లీ వార్‌ మొదలుపెట్టారు.

కాగా ఈపాటికే విన్నర్‌ ఎవరో డిసైడ్‌ అయిందంటూ సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. ఇందులో శ్రీముఖి బిగ్‌బాస్‌ టైటిల్‌తో కనిపిస్తుంది. స్టేజీపై ఉన్న నాగార్జున టైటిల్‌ గెలుచుకున్న శ్రీముఖిని అభినందించడం ఫొటోలో చూడవచ్చు. బిగ్‌బాస్‌ షోను ఆదరించే అభిమానులు ఈ ఫొటో చూసి గందరగోళంలో పడ్డారు. ఇది నిజమేనా అంటూ తలలు పట్టుకున్నారు. దీంతో ఈ వైరల్‌ ఫొటోపై శ్రీముఖి సోదరుడు శుశ్రుత్‌ నోరు విప్పాడు. ‘అది ఫేక్‌ ఫొటో, ఇంకా ఫినాలే పూర్తవలేదు, ఎవరూ దాన్ని నమ్మకండి’ అంటూ జనాలకు క్లారిటీ ఇచ్చాడు. దీంతో మిగతా కంటెస్టెంట్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!