HomeTelugu Trendingనా జోలికి వస్తే పుచ్చ పగిలిపోద్ది: మెహబూబ్‌

నా జోలికి వస్తే పుచ్చ పగిలిపోద్ది: మెహబూబ్‌

fight between contestants 2
బిగ్‌బాస్‌ సీజన్‌-4 తెలుగు ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో 4వ వారం కెప్టెన్సీ పోటీ ప్రారంభమైంది. దాని కోసం ‘బిబి గ్రాండ్ హోటల్‌’ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో రెండు టీమ్‌లు ఉన్నాయి. గెస్ట్‌లు ఒక టీమ్. హోటల్‌ స్టాఫ్‌తో ఒక టీమ్. ఇందులో గెస్టులకు హోటల్‌ సిబ్బంది సేవలు చేసి ఫైవ్‌ స్టార్‌ సంపాదించాలి. అయితే ఇటువంటి టాస్కే గత బిగ్‌బాస్‌లో కూడా మనం చూశాం.

సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్ హోటల్ స్టాఫ్‌లో ఒకరిగా ఉన్నప్పటికీ అతిధుల టీమ్ తరుపున ఆడాలి. హోటల్ స్టాఫ్ ఛాలెంజ్‌లను, సర్వీసులను పాడు చేయాలి. వారు గెలవకుండా చూడాలి. సీక్రెట్ టాస్క్ చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి. ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీక్రెట్ టాస్క్‌లో విజయవంతం అయితే డైరెక్ట్‌గా కెప్టెన్ పోటీదారుడిగా నిలువొచ్చని అవినాష్‌కు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

అతిథులుగా.. మెహబూబ్, సొహైల్, హారిక, గంగవ్వ ప్రిన్సెస్‌గా అరియానా ఉంటుందని రెండు టీమ్‌లుగా డివైడ్ చేశారు. ఇక ఈ గేమ్ ప్రారంభం కాగానే..ఎవరి పాత్రల్లో వాళ్లుజీవించేశారు. హోటల్ టీమ్.. గెస్టులకు సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తే.. అవినాష్ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా వాటిని చెడగొట్టడానికి ప్రయత్నించాడు. ఇక రేపటి ఎపిసోడ్ హైలైట్స్ లో  మెహబూబ్‌, అఖిల్‌ మధ్య పెద్ద గొడవే జరిగినట్లు తెలుస్తోంది. నా జోలికి వచ్చిన వాడు ఎవడైనా పుచ్చ పలిగిపోతుంది అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు మెహబూబ్. దీంతో ఇంట్లో కొంచెం గందరగోళం జరిగినట్లు కనిపిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu