HomeTelugu Big Storiesనాగార్జున ఆఫర్..‌ అర‌గుండు చేయించుకున్న అమ్మ రాజశేఖర్‌

నాగార్జున ఆఫర్..‌ అర‌గుండు చేయించుకున్న అమ్మ రాజశేఖర్‌

Nagarjuna deal accepted byబిగ్‌బాస్-4 వీకెండ్‌ కావడంతో నాగార్జున స్టేజ్‌పై సందండి చేయనున్నాడు. ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్‌ చేసిన త‌ప్పొప్పుల‌ను సవరించనున్నాడు. ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులతో టాస్క్ చేయించిన సంగ‌తి తెలిసిందే. దానిలో ఒకటైన అర‌గుండు, అర‌గ‌డ్డం గీసుకోవ‌డానికి మాత్రం ఏ ఒక్క‌రూ ధైర్యం చేయ‌లేక‌పోయారు. అఖిల్ టీమ్‌లో ఉన్న‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చినప్ప‌టికీ ఆఖ‌రు నిమిషంలో త‌న వ‌ల్ల కాద‌ని వెనక‌డుగు వేశాడు.

అయితే మ‌రోసారి నాగ్‌ ఇదే టాస్కు ఇస్తూ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు. అర‌గుండు గీసుకుంటే త‌ర్వాతి వారం నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించాడు. దీంతో మాస్ట‌ర్ డీల్‌కు అంగీక‌రించాడు. అత‌డికి నోయ‌ల్ అర‌గుండు గీశాడు. దీనికి మాస్ట‌ర్ క‌న్నా దివి ఎక్కువ‌గా బాధ‌ప‌డుతోంది. కన్నీరు పెట్టుకుంది. దీంతో వ‌చ్చే వారం నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు పొందిన‌ట్లు క‌నిపిస్తోంది.

 

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu