HomeTelugu Big Storiesఘనంగా ప్రారంభమైన 'బిగ్‌బాస్‌-4' గ్రాండ్‌ ఫినాలే

ఘనంగా ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌-4’ గ్రాండ్‌ ఫినాలే

Bigg boss 4 grand finale

తెలుగు బిగ్‌బాస్-4 గ్రాండ్ ఫినాలే ఘనంగా ప్రారంభమైంది. స్టార్‌ మాలో 106 రోజుల పాటు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ నాలుగో సీజన్ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన ఈ షో సెప్టెంబర్ 6న ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లను పరిచయం చేసిన నాగార్జున.. వాళ్లందరినీ బిగ్ బాస్ ఇంట్లోకి ఒక్కొక్కరిగా పంపారు. 16 మందికి మరో ముగ్గురు కంటెస్టెంట్లు జతయ్యారు. ఏడో రోజు నటుడు కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. ఆ తరవాత 11వ రోజు ‘జబర్దస్త్’ ముక్కు అవినాష్, 19వ రోజు స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ల సంఖ్య 20కి చేరింది. మొత్తం మీద 14వ వారం వరకు వారానికి ఒక కంటెస్టెంట్ చొప్పున బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇద్దరు కంటెస్టెంట్లు గంగవ్వ, నోయల్ స్వతహాగా బయటికి వచ్చేశారు. చివరికి అఖిల్, అభిజీత్, సోహెల్, హారిక, అరియానా టాప్ 5 కంటెస్టెంట్లుగా, ఫైనలిస్టులుగా మిగిలారు. ఇక ఈ రోజు బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరు అనేది ఈ రోజు తేలనుంది.

ఈ రోజు గ్రాండ్‌ ఫినాలే లో స్టేజ్‌పై హోస్ట్ నాగార్జున ఎంట్రీ అందిరిపోయింది. తరవాత బిగ్‌బాస్ సీజన్- 4 నుంచి ఎలిమినేట్ అయిన 14 మంది కంటెస్టెంట్లు స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో స్టేజ్‌పై సందడి చేశారు. బిగ్‌బాస్-4కు 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇంటిలోని సభ్యులు కూడా అదిరిపోయే స్టెప్స్‌ వేశారు. ఇక హౌస్‌లో జర్నీ చూపించాడు బిగ్‌బాస్‌. ఇక ఫ్యామిలీ మెంబర్స్‌ అందరు కంటెస్టెంట్స్‌ని విష్‌ చేశారు.ఇంటి సభ్యులు ఇంటిలో తమకు ఇష్టమైన ప్లేస్‌ల వద్ద జెండా పెట్టారు. వారికి ఆ ప్లేస్‌తో ఉన్న సంబంధాన్ని తెలిపారు. ఇక ఇంటి నుండి ఒకర్ని ఎలిమినేట్‌ చేసే సమయం వచ్చేసింది అని నాగ్‌ తెలిపారు. ఎలిమినేట్‌ అయిన వారిని సెలబ్రెటీలు బయటకు తీసుకువస్తారు అన్నాడు.

స్టేజ్‌పై ముందుగా ప్రణీత బాపు బొమ్మ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా స్టేజ్‌పైకి వచ్చాడు. ఎలిమినేట్‌ అయిన వారిని ఇంటి నుండి బయటకు తీసుకురమ్మని అనిల్‌ రావిపూడి, మెహరీన్‌ను హౌస్‌లోకి పంపించాడు. డప్పులు, డ్యాన్స్‌తో హౌస్‌లో అడుగు పెట్టిన మెహ్రీన్‌, అనిల్‌ కంటెస్టెంట్స్‌ని కొన్ని ప్రశ్నలు అడిగారు. అనంతరం టాప్‌5 లో ఉన్న హారికను ఎలిమినేట్‌ చేశారు. ప్రణీత, లక్ష్మీ రాయ్‌ని సూట్‌కేసు‌తో రూ. 10 లక్షలు ఇచ్చి హౌస్‌లోకి పంపించాడు నాగార్జున. ఈ డబ్బుతో ఇంటి సభ్యులను టెంప్ట్ చేసి బయటకు తీసుకు రావాలి. లేకపోతే మీరే ఒకర్ని ఎలిమినేట్‌ చేయాలి అన్నాడు. డబ్బు తీసుకోవడానికి ఎవరూ అంగీకరించలేదు. టాప్‌-4 నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి లక్ష్మీరాయ్ హౌస్‌లోకి వెళ్లింది. అరియానా ఎలిమినేట్‌ అయింది. ఇక హౌస్ లో ముగ్గురు మాత్రమే మిగిలారు. అనంతరం మెహ్రీన్‌ స్టేజ్‌పై డ్యాన్స్‌ ఫర్ఫార్మెన్స్‌ చేసింది. టాప్‌-3 కంటెస్టెంట్స్‌కి రూ.20 లక్షల ఆఫర్‌ ఇచ్చాడు. బ్రీఫ్‌ కేస్‌ ఇచ్చి ఎవరు తీసుకుంటారు అని అడిగాడు. తీసుకుకోక పోయినా ఎలిమినేట్‌ అవుతారు అన్నాడు. మీ డ్రీమ్స్‌ ఏంటి అని అడిగాడు. ఈ డబ్బుతో ఈ డ్రీమ్స్‌ తీరిపోతాయి అన్నాడు.

ఎవరూ అంగీకరించకపోవడంతో 5 లక్షలు పెంచాడు. దీంతో సోహైల్‌ ఆ డబ్బులు తీసుకుపోవడానికి రెడీ అయిపోయాడు. బిగ్‌బాస్‌ చరిత్రలోనే 25 లక్షలు తీసుకుని గేమ్‌ నుండి డ్రాప్‌ అయిపోవడం ఇదే తొలిసారి. తన తండ్రి కూడా డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఈ డబ్బులో 5 లక్షలు ట్రస్ట్‌కి ఇస్తాను. 5 మెహబూబ్‌కి ఇస్తాను అన్నాడు సోహైల్‌. అయితే నాకు ఆ డబ్బు వద్దు.. అవి కూడా ట్రస్ట్‌కే ఇచ్చేయ్‌ అన్నాడు మెహబూబ్‌. దీంతో నాగ్‌ కల్పించుకుని మీరు ట్రస్ట్‌కి డబ్బులు ఇవ్వవద్దు నేను ఇస్తాను. ఈ డబ్బు మీరే ఉంచుకోండి అన్నాడు. లక్ష్మీరాయ్‌ తన ప్రదర్శనతో హీట్‌ ఎక్కించింది. ఇక రన్నర్‌, విన్నర్‌ మాత్రమే మిగిలి ఉన్నారు. ఎవరు విన్నర్‌ గా నిలుస్తారో చూడాలి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, సింగర్స్‌ పాటలతో హౌస్‌లో హుషారు తెప్పించారు. ట్రోపీని స్టేజ్‌ పైకి తెస్తూ చేసిన డ్యాన్స్ అదుర్స్‌. ఇక అభి, అఖిల్‌ను స్టేజ్‌పైకి తీసుకురావడానికి నాగ్‌ ఇంట్లోకి వచ్చాడు. అభి, అఖిల్‌ను బిగ్‌బాస్‌ విష్‌ చేశాడు. హౌస్‌లో లైట్స్‌ ఆఫ్‌ చేశాడు నాగార్జున. కారులో డప్పులతో ఇద్దరినీ స్టేజ్‌ పైకి తీసుకువెళ్లాడు నాగార్జున.

ట్రోఫీ ఇవ్వడానికి టాలీవుడ్‌ బిగ్‌బాస్‌ మెగాస్టార్‌ చిరంజీవి స్టేజ్‌పైకి వచ్చాడు. కాసేపు స్టేజ్‌పై సరదాగా మాట్లాడాడు చిరంజీవి. నాగ్‌ ఫిగర్‌ చూసి కడుపు మండిపోయింది అన్నాడు. నవ మన్మధుడు అంటూ పొగిడేశాడు. 10 సీజన్‌ల వరకు మీరే హోస్ట్‌గా ఉండాలి అని నాగ్‌ను విష్‌ చేశాడు. హోస్ట్‌ నాగార్జున జర్నీ చూపించాడు బిగ్‌బాస్‌. నాగ్‌ జర్నీని
అద్భుతంగా చూపించాడు. అభిజిత్‌ని మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అభివర్ణించాడు చిరంజీవి. అఖిల్‌ని కూడా బాగా ఏడిపించాడు. సోహైల్‌ గురించి మాట్లాడాడు. కథ వేరుంటాది అనే డైలాగ్‌ తన నెక్స్ట్‌ సినిమాలో పెట్టుకుంటాను అన్నాడు చిరంజీవి. డబ్బు విషయంలో కూడా సోహైల్‌ని మెచ్చుకున్నాడు చిరంజీవి. సోహైల్‌ కోసం ఇంటి నుంచి మటాన్‌ బిర్యానీ తీసుకువచ్చాడు. ఇది ప్రత్యేకంగా తన భార్య సురేఖ వండి పంపించింది. ఇక సోహైల్ సినిమాను కూడా ప్రమోట్‌ చేస్తానని, వీలైతే సినిమాలో చిన్న క్యారెక్టర్‌ కూడా చేస్తాను అని హామీ ఇచ్చాడు చిరంజీవి. తరువాత ఇంటి సభ్యులు అందరి గురించి ప్రస్తావించాడు. మెహబూబ్‌ని చిన్నప్పుడు తనలో ఉన్న కసిని అతనిలో చూశానని అన్నాడు చిరంజీవి. సోహైల్‌ డబ్బు తీసుకోవద్దు. నేనే నీకు 10 లక్షలు ఇస్తాను అన్నాడు చిరంజీవి. స్టేజ్‌ మీదే చెక్‌ రాసి ఇచ్చేశాడు. దివికి చిరంజీవి తన తరువాత సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నట్లు చెప్పాడు. చివరిగా విన్నర్‌ని ప్రకటించే టైమ్‌ వచ్చేసింది. నాగ్‌ ఇద్దరి చేతులను పట్టుకున్నాడు. బిగ్‌బాస్‌-4 విన్నర్‌గా అభిజిత్ ని ప్రకటించాడు. చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకున్నాడు. అఖిల్‌ రన్నరప్‌‌గా నిలిచాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu