HomeTelugu Big Storiesబిగ్ బాస్-4 సెప్టెంబర్ 20 హైలైట్స్‌

బిగ్ బాస్-4 సెప్టెంబర్ 20 హైలైట్స్‌

Bigg Boss 4 telugu 20th Sep

ఈ రోజు నాగేశ్వరావు జయంతి సందర్భంగా.. ఒక లైలా కోసం సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. ఇక నిన్న ఎలిమినేటైన కళ్యాణి స్టేజ్‌ పైకి వచ్చింది. బిగ్‌బాస్‌ జర్నీ వీడియో చూపించాడు. ఇక హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన నాగ్‌.. ఈ రోజు సండే..ఫన్‌డే అని ఇంటి సభ్యులతో అన్నాడు. స్టేజ్‌పై కళ్యాణి ఇంటి సభ్యులకు ర్యాంకింగ్‌ ఇచ్చింది.
బాటమ్-5:
‌5-సోహైల్‌
4-సుజాత
3-అరియానా
2-కుమార్‌ సాయి
1-గంగవ్వ
టాప్‌5:
1-హారిక
2-అమ్మ రాజశేఖర్‌
3-మోనాల్‌
4-దివి
5-అభిజిత్‌
ఇక మిగిలిన వారి గురించి చెప్పమంటే.. దేవిని తక్కువ అంచనా వెయ్యొద్దు అని, లాస్య అయోమయం అని, నోయల్‌ తన గేమ్‌ తాను చెడగొట్టుకుంటున్నాడు అని, అవినాష్‌ గేమ్‌లో బలైపోతాడు అని, మెహబూబ్‌కు గేమ్‌ మొత్తం తనవైపు తిప్పుకునే సత్తా అంది అని చెప్పింది కళ్యాణి. ఆ తరువాత స్టేజ్‌పై హరికథ చెప్పింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతున్న కళ్యాణి.. నాగార్జున ఇచ్చిన బిగ్ బాంబ్‌ను దేవీ నాగవల్లిపై వేశారు. ఇంతకీ ఆ బాంబ్ ఏంటంటే.. మూడో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేయడం. అంటే, మూడో వారం నామినేషన్స్‌లో దేవి అప్పుడే చేరిపోయింది. కెప్టెన్‌ నోయల్‌ ఇంటి సభ్యులకు బెలూన్‌ ఇచ్చాడు. ఈ బెలూన్‌ తలపై పెట్టుకుని బ్రేక్‌ చేయాలి. అయితే ఎవరికి గ్రీన్‌ వస్తే వారు సేఫ్ అని చెప్పాడు నాగ్‌. అభిజిత్‌, కుమార్‌ సాయికి గ్రీన్‌ వచ్చింది. నోయల్‌, మోనాల్‌, హారిక, అఖిల్‌, అమ్మ రాజశేఖర్‌ కు రెడ్‌ అంటే.. డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. అయితే హౌస్‌మేట్స్‌తో డాగ్‌ అండ్‌ బోన్‌ గేమ్‌ ఆడించాడు.
అభిజిత్‌, అఖిల్‌ గేమ్‌ అడగా.. అఖిల్‌కు బోన్‌ దొరికింది. అయితే అభిజిత్‌ ఓడిపోయాడు. మోనాల్‌, హారిక.. మోనాల్‌ విన్నర్‌. హారికాకు టాస్క్‌ ఇచ్చాడు. నోరు మూసుకోకుండా.. మోనాల్‌ను పొగడమన్నాడు. ఇది ఫన్నీగా అనిపించింది. సోహల్‌, మెహబూబ్‌: బోన్‌ కోసం వీరిద్దరి మధ్య గట్టిపోటీ జరిగింది చివరికి.. మెహబూబ్‌ గెలిచాడు.. సోహైల్‌ పచ్చి ఉల్లిపాయ తిన్నాడు. దేవి, అమ్మరాజశేఖర్‌: దేవి విన్నర్‌, అమ్మరాజశేఖర్‌ మిర్చి తిన్నాడు. మధ్యలో మరో హౌస్‌మేట్‌ అమ్మ రాజశేఖర్‌ని సేవ్‌ చేశాడు. నాగార్జున గేమ్‌ తిరిగి స్టార్ట్‌ చేశాడు. సుజాత, లాస్య: బోన్‌ కోసం ఇద్దరు కొట్టుకున్నారు. సుజాత విన్నర్‌ కాగా.. లాస్య చిన్నపిల్లలా నటించింది. దివి,అరియానా: దివి విన్నర్‌.. అరియానా పోల్‌ డాన్స్‌ చేసింది. గంగవ్వ, కుమార్‌ సాయి: వసూల్‌.. వసూల్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టింది గంగవ్వ. గంగవ్వ విన్నర్‌. కుమార్‌ సాయి ఓడిపోవడంతో నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడాలి. అవినాష్‌, నోయల్‌: అవినాష్‌ విన్నర్‌, అవినాష్‌ కళ్లు మూసుకుని నోయల్‌కు లిప్‌స్టిక్‌ పెట్టాలి. ఈసారి సోహైల్‌, నోయల్‌ను సేవ్‌ చేశాడు నాగ్‌. ఇక మోనాల్‌, హారిక ఇద్దరు మిగిలారు. వాటర్‌ బౌల్స్‌ ఇచ్చారు. మోనాల్‌ గ్రీన్‌, హారిక బ్లూ ఇచ్చారు. ఎవరి బౌల్‌ ఫుల్‌గా ఉంటే వాళ్లు ఎలిమినేట్‌.
హారిక: అభిజిత్‌, అఖిల్‌, హారిక, సుజాత,
మోనాల్‌: దేవి, అరియానా, దివి,
ఈ వారం హారిక ఎలిమినేట్‌ అయిపోయింది. అయితే గేట్‌ వరకు వచ్చిన హారిక ను ఇంటిలోకి రమ్మని చెప్పాడు. అయితే సెల్ఫ్ నామినేట్‌ చేసుకున్నావ్‌.. ఇది అందరికీ వార్నింగ్‌ అంటూ.. నాగార్జున చెప్పాడు. ఇప్పటి వరకు ఓటింగ్‌ వచ్చింది అని ఇంటి సభ్యులకు చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu