జెనీలియా జోరు పెంచుతుందా..?

తెలుగు, తమిళ, హిందీ బాషల్లో కథానాయికగా తన స్టామినాను నిరూపించుకుంది జెనీలియా. అల్లరి పిల్లగా యూత్ లో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీని ఎవరు రీప్లేస్ చేయలేరని చెబుతుంటారు. అంతగా ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్న జెనీలియా వివాహం అనంతరం సినిమాలకు దూరమయ్యింది.

ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇప్పుడు ఆమె ‘ఫోర్స్ 2’ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో సోనాక్షి సింహా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. జెనీలియా ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. 2011లో వచ్చిన ‘ఫోర్స్’ సినిమా క్లైమాక్స్ లో జెనీలియా పాత్ర చనిపోతుంది.

దీంతో సీక్వెల్ గా రాబోతున్న ‘ఫోర్స్ 2’లో ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అలానే తమిళంలో కూడా ఓ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వనుందనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాల తరువాత జెనీలియా తన జోరు ఎంతవరకు పెంచుతుందో.. చూడాలి!