HomeTelugu Big Storiesహీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్‌బాస్‌ బ్యూటీ!

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్‌బాస్‌ బ్యూటీ!

Bigg boss contestant ariyan
తెలుగు బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌ అరియానా గ్లోరీ తన బోల్డ్‌ నెస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంక‌ర్‌గా ఉన్న టైమ్‌లో రామ్‌ గోపాల్‌ వర్మ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. బిగ్‌బాస్‌లో టాప్ 4లో నిలవడంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగారు. ఇప్పుడు ఆ అమ్మడికి తెలుగులో ఓ అవకాశం వచ్చిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది.

యంగ్‌ హీరో రాజ్ త‌రుణ్‌తో కలిసి ఓ సినిమా చేస్తుందని ఫొటోను బట్టి భావించవచ్చు. సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు ఫేమ్ ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ గ‌విరెడ్డి ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలపకుండా ‘‘బిగ్‌బాస్ త‌ర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గ‌విరెడ్డి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్’’ అని ఫొటో పెట్టి పోస్టు చేసింది. రాజ్‌తరుణ్‌, దర్శకుడు శ్రీనివాస్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. దీంతోపాటు అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌‌ని హ్యాష్ ట్యాగ్‌ చేసింది. అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా వస్తున్న సినిమాలో అరియానా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

https://www.instagram.com/p/CKUDVstp_yW/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu