HomeTelugu Trendingనేను ఆ వేడుకకు రావడం లేదు: ఎస్‌.ఎస్‌ రాజమౌళి

నేను ఆ వేడుకకు రావడం లేదు: ఎస్‌.ఎస్‌ రాజమౌళి

7 3దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే అక్కడ త్వరలో జరగనున్న తానా సభలకు హాజరయ్యేందుకే అమెరికా వెళ్లారని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై రాజమౌళి ట్విటర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘ఫ్రెండ్స్‌.. నేను వ్యక్తిగత పని మీద వాషింగ్టన్‌కు వచ్చాను. తానా వేడుకల నిమిత్తం కాదు. నేను ఎలాంటి మ్యూజికల్‌ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేను. నేను వస్తానని ఆశించి తీరా రాకపోయేసరికి బాధపడే నా అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ క్లారిటీ ఇవ్వాలనుకున్నాను’ అని పేర్కొన్నారు.

మరోపక్క ఆయన తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని జక్కన్న కుమారుడు కార్తికేయ వెల్లడించారు. చిత్రీకరణలో భాగంగా ఇటీవల కొన్ని సీక్వెన్స్‌లను తెరకెక్కించామని, అవి అనుకున్నట్లే సంతృప్తికరంగా వచ్చాయని తెలిపారు. వారం రోజుల పాటు చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చామని పేర్కొన్నారు. ‘ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి. అల్లూరి పాత్రలో రామ్‌చరణ్‌ను లుక్‌ను మీ ముందుకు తీసుకురావడానికి మేమెంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం’ అని చిత్రబృందం ట్వీట్‌లో పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu