HomeTelugu Trendingపూరి 'ఇస్మార్ట్‌ శంకర్‌' సంబరాల్లో వర్మ

పూరి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సంబరాల్లో వర్మ

5 19వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన శిష్యుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో వర్మ సంతోషంతో వరుస ట్వీట్లు చేస్తున్నారు. పూరీ నంబర్‌ 1 దర్శకుడని మరోసారి రుజువైందని మెచ్చుకున్నారు. అంతేకాదు శనివారం థియేటర్‌లో డ్యాన్స్‌ చేయబోతున్నామని ట్వీట్‌ చేశారు. ‘హే పూరీ జగన్నాథ్‌, ఛార్మి.. నేను, ‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతి (వర్మ శిష్యుడు), ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం పనిచేసిన అగస్త్య కలిసి బైక్‌పై మాస్‌ గెటప్‌లతో థియేటర్‌కు వెళ్లి.. డ్యాన్స్‌ చేయబోతున్నాం. మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో 2 గంటల షోకు హాజరు కాబోతున్నాం’ అని వర్మ పోస్ట్‌ చేశారు.

మరోపక్క ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద విశేషమైన స్పందన లభించింది. కేవలం రెండు రోజుల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.25 కోట్లకుపైగా రాబట్టిందని పూరీ కనెక్ట్స్‌ పేర్కొంది. అంతేకాదు ఓ థియేటర్‌లో ఉన్న సీట్లు సరిపోక.. అదనంగా కుర్చీలను తెప్పించారని ఛార్మి ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘ఇస్మార్ట్‌ బ్లాక్‌బస్టర్‌’ అని ఆనందం వ్యక్తం చేశారు. చిత్రం సక్సెస్‌ అందుకున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి చిత్ర బృందం పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పూరీని ముద్దుపెట్టుకుంటున్న ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu