HomeTelugu Trendingప్రభాస్ మూవీలో పాత్రపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ విన్నర్

ప్రభాస్ మూవీలో పాత్రపై క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ విన్నర్

Bigg Boss winner Siddarth S

ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓమ్ రౌత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకపాత్రకు హిందీ బిగ్‌బాస్ విన్నర్ సిద్ధార్థ్‌ శుక్లాను సంప్రదించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ విషయంపై సిద్ధార్థ్ శుక్లా స్పందిస్తూ ఆదిపురుష్ సినిమాలో కీలక పాత్ర గురించి తనను ఎవరూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చేశాడు. హిందీలో బాలికా వధు, దిల్‌ సే దిల్‌ తక్‌ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన సిద్దార్థ్ శుక్లా హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌13తో మరింత పాపులర్‌ అయ్యాడు. సిద్దార్థ్‌ శుక్లా నటించిన ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ అనే ఓ వెబ్‌సిరీస్‌ త్వరలో విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu