HomeTelugu Big Storiesఆదిపురుష్‌: 'రామ్ .. సీతారామ్' సాంగ్‌ విడుదల

ఆదిపురుష్‌: ‘రామ్ .. సీతారామ్’ సాంగ్‌ విడుదల

Ram Sita Ram from Adipurush

ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో సీతాగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అజయ్, అతుల్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలలో ‘రామ్ సీతా రామ్’ పాట ఎక్కువగా ఆకట్టుకుంది. సీతారాములపై చిత్రీకరించిన ఈ పాటకి, సాహిత్యంతో పాటు మంచి విజువల్స్ తోడయ్యాయి.

ఈ సినిమాలోని డైలాగ్స్ లో రాఘవ – జానకి అంటూ వింటూ వచ్చిన ప్రేక్షకులకు, ఈ పాటలో సీత – రామ్ అని వినిపించగానే మనసు ఊరట చెందుతుంది. అలాంటి ఈ పాట తెలుగు వెర్షన్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. ‘ఆదియు అంతము రాముడిలోనే .. మా అనుబంధము రాముడితోనే’ అంటూ కాస్త ఎమోషనల్ గా కూడా ఈ పాట కనెక్ట్ అవుతుంది. 10 రోజుల్లో 450 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 500 కోట్ల దిశగా వెళుతోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu