కాంగ్రెస్‌ చేరనున్న బిగ్‌బాస్‌ విన్నర్‌

‘బాబీ జీ ఘర్‌ పర్‌ హై’ ఫేమ్‌, బిగ్‌బాస్‌ 11 సీజన్‌ విన్నర్‌ శిల్పా షిండే మంగళవారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సంజయ్‌ నిరుపమ్‌ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. కొంతకాలంగా శిల్పా షిండే రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్పా, వాటిపై ఆమె స్పందించలేదు. 1999లో బాగా ప్రాచుర్యం పొందిన టీవీ సీరియల్‌ ‘బాబీ జీ ఘర్‌ పర్‌ హై’ సీరియల్‌లో అంగూరీ బాబీ పాత్ర ద్వారా ఆమె బుల్లితెరపై కనిపించారు. 2017అక్టోబర్‌లో వచ్చిన బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో పాల్గొని, బిగ్‌బాస్‌ సీజన్‌11 విజేతగా నిలిచారు. శిల్పా షిండే మహారాష్ట్రలోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.