HomeTelugu Newsభారత్‌లో 40,263కు చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 83 మృతి

భారత్‌లో 40,263కు చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 83 మృతి

11 2

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో (మే 3 సాయంత్రం 5 గంటల వరకు) కొత్తగా 2,487 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్క రోజులో గరిష్ఠ పెరుగుదల ఇదే కావడం గమనార్హం. మరోవైపు ఒక్కరోజులోనే 83 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,263కు చేరగా.. మరణాల సంఖ్య 1,306కు చేరినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 10,886 మంది ఈ వైరస్‌ బారి నుంచి కోలుకున్నారని, 28,070 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్రం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 12,296 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. 521 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది కోలుకున్నారు. ముంబయి నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదవుతుండడం గమనార్హం. గుజరాత్‌లో సైతం కరోనా విజృంభణ తగ్గడం లేదు. మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లో కేసుల సంఖ్య 5 వేలు దాటింది. 262 మంది మరణించారు. 896 మంది కోలుకున్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య వెయ్యి దాటింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu