HomeTelugu Trending'బింబిసార' టీజర్‌ విడుదల

‘బింబిసార’ టీజర్‌ విడుదల

BIMBISARA Teaser

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘బింబిసార’. చారిత్రక నేపథ్యం ఉన్న కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్‌, సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు. కల్యాణ్‌రామ్‌ పాత్రను తెలియజేసేలా ఈ టీజర్‌ రూపుదిద్దుకొంది.

‘‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసులైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది’’ అనే సంభాషణలతో సాగిన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా పొడవాటి జుత్తుతో సీరియస్‌ లుక్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించారు. ఇక, టీజర్‌ చివర్లో ఆయన స్టైలిష్‌ లుక్‌లోనూ సందడి చేశారు. యన్‌.టి.ఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌ రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu