HomeTelugu Trending'డెవిల్‌ ట్రైలర్‌' వచ్చేసింది

‘డెవిల్‌ ట్రైలర్‌’ వచ్చేసింది

Devil movie Trailer
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత. బ్రిటీష్ కాలం నాటి కథాంశంతో ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలోని పోరాట దృశ్యాల గ్లింప్స్ గా ఈ ట్రైలర్ ను పేర్కొనవచ్చు. డెవిల్… పేరుకు తగ్గట్టే కల్యాణ్ రామ్ ఈ చిత్రంలో భీకర పోరాటాలు చేశారని ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. “విశ్వాసంగా ఉండడానికి, విధేయతతో బతికేయడానికి కుక్క అనుకున్నావురా… లయన్” అంటూ కల్యాణ్ రామ్ పౌరుషంతో మీసం మెలేయడం ట్రైలర్ లో రోమాంఛకంగా అనిపిస్తుంది.

ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. ఇప్పటికే డెవిల్ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో, పాటకు విశేష స్పందన లభించింది. కాగా ఈ చిత్రం డిసెంబరు 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu