త్రిష మాజీ లవర్ తో మరో హీరోయిన్!

ఆవకాయ్ బిరియాని, బంపర్ ఆఫర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి బిందు మాధవి.. తెలుగమ్మాయి అయినా.. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. జాక్సన్ దొరై తమిళంలో ఆమె నటించిన ఆఖరి సినిమా. ఆ తరువాత మరే సినిమాలో ఆమె కనిపించలేదు. రీసెంట్ గా ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి ఆమె సన్నిహితంగా మెలిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆ వ్యాపారవేత్త ఎవరు అనుకుంటున్నారా..? గతంలో త్రిషను నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి మాత్రం క్యాన్సిల్ చేసుకున్న వరుణ్ మనియన్. సినిమాలో నటించొద్దని వరుణ్ చెప్పడం వలనే త్రిష తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు నటి బిందు మాధవి, వరుణ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేస్తోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ.. ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై ఈ జంట ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి!