HomeTelugu Big Storiesరజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే‌ అవార్డు

రజనీకాంత్‌కు దాదాసాహెబ్‌ ఫాల్కే‌ అవార్డు

superstar Rajinikanth confeసౌత్‌ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. “ఈ విషయాన్ని తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అద్భుతం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను’ అంటూ మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెల్లడించారు. రజనీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu