HomeTelugu Trendingనితేష్ తివారీ 'రామాయణం'లో కుంభకర్ణుడిగా బాబీ డియోల్‌?

నితేష్ తివారీ ‘రామాయణం’లో కుంభకర్ణుడిగా బాబీ డియోల్‌?

Bobby Deol as Kumbhakarna iబాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఇటీవలే యానిమల్‌ సినిమాలో విలన్‌ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యానిమల్ సక్సెస్ తో ఇండస్ట్రీలో బాబీకి డిమాండ్ బాగా పెరిగింది. అతనికి వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా ఆయన రామాయణంలో కుంభకర్ణుడిగా కనిపించనున్నట్లు టాక్‌. రామాయణం ఆధారంగా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిల్లో ఇప్పటికే ఆదిపురుష్, హనుమాన్ సినిమాలు రాగా.. తాజాగా దంగల్ ఫేమ్ నితేష్ తివారీ కూడా మరో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ రామాయణం మూవీలో కుంభకర్ణుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారా దత్తాను అనుకుంటున్నట్లు సమాచారం. ఇక హనుమంతుడి పాత్ర కోసం బాబీ డియోల్ అన్న సన్నీ డియోల్ ను అనుకుంటున్నారు. ఈ పాత్రల కోసం ఇప్పటికే మేకర్స్ వాళ్లను సంప్రదించినట్లు పింక్‌విల్లాలో వచ్చిన వార్తలు వస్తున్నాయి. అబ్రార్ పాత్రతో దేశవ్యాప్తంగా బాబీకి వచ్చిన పాపులారిటీని ఇలా వాడుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేజీఎఫ్ స్టార్ యశ్.. రావణుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. దశరథుడి మూడో భార్య, మొత్తం రామాయణానికి కారణమైన ప్రధాన వ్యక్తి కైకేయి పాత్ర కోసం లారా దత్తా అయితే సరిగ్గా సరిపోతుందని నితీష్ తివారీ భావిస్తున్నట్లు టాక్.

Bobby Deol as Kumbhakarna 1

ఈ రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మార్చిలో మొదటి పార్ట్ తొలి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులోనే లారా దత్తా.. రణ్‌బీర్ కపూర్ తో కలిసి సెట్స్ లో చేరనున్నట్లు సమాచారం. ఇక భారీ కాయంతో ఈ మధ్య విలన్ పాత్రలకు అతికినట్లు సరిపోతున్న బాబీ డియోల్ కు.. కుంభకర్ణుడి పాత్ర ఇస్తే ఎలా ఉంటుందన్నది డైరెక్టర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే బాబీని సంప్రదించినా.. అతడి నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదట.

మరి ఈ పాత్రకు కుంభకర్ణుడి పాత్రకు అతడు ఓకే చెబుతాడా లేదా అన్నది చూడాలి. అటు అతని అన్న సన్నీ డియోల్ ను.. హనుమంతుడి పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. అయితే ఈ పాత్రలకు నటులు ఇంకా ఫైనల్ కాలేదు. ఇవే కాదు మిగిలిన పాత్రల కోసం కూడా నితేష్ తివారీ నటీనటుల వేటలో ఉన్నాడు.

ఈ సినిమాని 700 కోట్లకుపైగా బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఇది ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ కలిగిన సినిమాగా నిలవనుంది. రాముడి పాత్ర పోషించనున్న రణ్‌బీర్ కపూర్ ఈ సినిమా కోసం రూ.75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!