చిరు 152 వ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ !

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటె దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. తాజా సమచారం ప్రకారం, చిరంజీవి 152 వ సినిమా కోసం బాలీవుడ్ నటి హుమా ఖురేషి ని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతున్నది. మెగాస్టార్ 150 వ సినిమాలో కాజల్, 151 వ సినిమాలో నయనతారలు నటించారు. 152 వ సినిమా కోసం అనేకమంది పేర్లను పరిశీలించినట్టుగా తెలుస్తున్నది. చివరికి హుమా ఖురేషిని ఎంపిక చేశారని, చిరు సినిమాలో యాక్ట్ చేసేందుకు హుమా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం.