‘మహర్షి’ విలన్‌?

మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్నసినిమా ‘మహర్షి’. ఈ సినిమాలో సీనియర్‌ నటుడు సాయికుమార్‌ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎవడు’ చిత్రానికి కూడా వంశీ పైడిపల్లియే దర్శకుడనే విషయం తెలిసిందే. ఆ చిత్రంలో సాయికుమార్‌ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ‘మహర్షి’లో కూడా మంచి పాత్ర డిజైన్‌ చేసి ఉంటారని ఊహించవచ్చు. ఈ వార్తలపై చిత్ర టీమ్ ఇంకా స్పందించలేదు. ‘మహర్షి’ సినిమాని ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక కాగా అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.