కమాండర్ వర్థమాన అభినందన్ జీవితంపై సినిమా!

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వర్థమాన అభినందన్ పేరు దేశం నలుమూలల మారుమోగిపోతోంది. దాదాపు 60 గంటల పాటు పాకిస్థాన్‌ చెరలో ఉన్న అభినందన్‌ సురక్షితంగా భారత్‌కు చేరుకున్నాడు. దీంతో ఆయనకు దేశ వ్యాప్తంగా చాలా పాపులారిటి వచ్చింది. ఇంత పాపులారీటి వున్న అభినందన్‌ను పేరును.. ఆయన పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు ఎదుర్కోన్న పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగా..అభినందన్ జీవిత చరిత్రను, పాకిస్థాన్‌లో ఉన్నప్పుడు ఆయన అనుభవాలను తెరకెక్కించాలని బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాతలు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా ఆ సినిమాకు సంబంధించి కొన్ని టైటిల్స్‌ను కూడా రిజిష్టర్ చేయించారు. తాజాగా పుల్వామా దాడి నేపథ్యంలో అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో టీ-సిరీస్‌, సంజయ్ లీలా భన్సాలీ కలిసి ఓ సినిమాను తెరకెకించనున్నట్లు తెలుస్తోంది.

అభినందన్‌పై వస్తున్న ఈ సినిమాలో హీరోగా ఎవరు అనేది ఇంకా ఫైనల్‌ కాలేదు. అయితే అవకాశం వస్తే అభినందన్ పాత్రలో నటించాలని ఉందని హిందీ హీరో జాన్‌ అబ్రహం ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన కోరికను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్‌మీద అభినందన్‌ పాత్ర చేయమని అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని అన్నారు. అభినందన్‌ దేశానికి రియల్ హీరో అని, అవకాశం వస్తే వదులుకోనని తన కోరికను తెలిపారు. అలాగే టీ సిరీస్ సంస్థ, సంజయ్ లీలా భన్సాలీలు కూడా పుల్వామా ఘటనపై సినిమా చేయడానికి సిద్ధమైనట్టు వార్తలొస్తున్నాయి.