HomeTelugu Trendingసత్యదేవ్‌కు బాలీవుడ్‌ ఆఫర్‌

సత్యదేవ్‌కు బాలీవుడ్‌ ఆఫర్‌

Satyadev bags a solid project in Hindi
టాలీవుడ్‌ హీరో సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటిస్తున్న సినిమాలు ఒకొక్కటి చొప్పున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. తాజాగా సత్యదేవ్‌కు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామ్ సేతు’ లో సత్యదేవ్ కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు బాలీవుడ్ కు చెందిన పలువురు స్టార్స్‌ కనిపించబోతున్నారు. ఇదే టైమ్‌లో ఈ సినిమాను సౌత్ లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు కనుక సౌత్ స్టార్స్ ను కూడా భాగం చేస్తున్నారు. పలు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్ నుండి వచ్చిన బంపర్ ఆఫర్ అవ్వడంతో మన ఉమామహేశ్వర వెంటనే ఓకే చెప్పేశాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu