‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మరో యంగ్‌ హీరో


నేచురల్‌ స్టార్‌ నాని హీరోగగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సాంకృత్యన్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో మరో యంగ్‌ హీరో కూడా కనిపించబోతున్నాడు. ఆయనెవరో కాదు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌. ఇందులో ఆయన సహాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని తానే ట్విటర్ వేదికగా తెలియజేశారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగుతుంది ఈ చిత్రం. ఇటీవలే విడుదలైన నాని ఫస్ట్‌లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

CLICK HERE!! For the aha Latest Updates