HomeTelugu Newspushpa 2: అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్!

pushpa 2: అతిథి పాత్రలో బాలీవుడ్ స్టార్!

Bollywood star guest role i

pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప- 2’. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవలే ఈ సినిమాలో దిశా పటాని ఐటమ్‌ సాంగ్‌లో మెరవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత పలువురు హీరోయిన్‌ల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ను రంగంలోకి దింపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ‘పుష్ప 2’లో డాన్ క్యారెక్టర్‌లో నటించనున్నట్లు తెలుస్తుంది. సినిమాలో ఓ హై పాయింట్ దగ్గర సంజయ్ దత్ పాత్ర ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్‌. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ చేసిన అధీర పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విలన్ రోల్‌లో సంజయ్ ఇరగదీశాడు. దీంతో పుష్ప 2 సినిమాలో సంజయ్ దత్ ఉంటే హిందీలో సినిమాకి ఇంకా ప్లస్ అవుతుందని మూవీ టీమ్ భావిస్తుందంట.

మూవీ టీమ్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ సీక్వెల్‌లో పుష్పలో ఉన్న పాత్రలతో పాటు కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా ఉంటాయని తెలిసింది. ఇక భన్వర్‌ సింగ్ షెకావత్ క్యారెక్టర్‌ చేస్తున్న ఫహాద్ ఫాజిల్‌ పుష్ప 2లో సినిమా మొత్తం ఉంటారని టాక్. ఎందుకంటే పుష్పలో సెకండాఫ్‌లో ఈ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

ఇటీవల పుష్ప 3పై అల్లు అర్జున్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. పుష్పను ఒక ఫ్రాంచైజీగా మార్చాలనే ఆలోచన తమకి ఉందని, కనుక పుష్ప 3పై ఆశలు పెట్టుకోవచ్చంటూ డైరెక్ట్‌గానే చెప్పాడు బన్నీ. అయితే పుష్ప 3 వెంటనే రాకపోవచ్చని.. కానీ తీసే అవకాశం చాలా ఎక్కువ ఉందంటూ అన్నాడు. నిజానికి పుష్ప సినిమాను కేవలం ఒక పార్ట్‌గానే తీద్దామని అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలైన తర్వాతే రెండు భాగాలుగా మార్చాలనే ఆలోచన వచ్చింది. పుష్ప- 2పై భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu