మైత్రీ సంస్థతో వరుణ్‌ తేజ్‌!

మెగా హీరో వరుణ్ తేజ్ భిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ మెల్లగా ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. ఇటీవలే ‘ఎఫ్ 2’ సినిమాతో విజయం సాధించిన ఈ హీరో ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాకుండా ఇంకొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశాడు. వాటిలో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా ఉంది. శ్రీమంతుడు, రంగస్థలం, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించిన సంస్థతో సినిమా అంటే భారీ స్థాయిలోనే ఉండే అవకాశముంది. మరి ఈ సినిమాకు దర్శకుడు ఎవరు వంటి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.