‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో బొమ్మాలి రవి ‘సింహ గర్జన’..!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ న్యూస్ ను బయటకు రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సాంగ్స్ బయటకు రిలీజ్ అయ్యాయి. వాడిగా, వేడిగా, సూటిగా ఉండటంతో పాటలకు హైప్ వచ్చింది.

ఇందులో గర్జన.. సింహ గర్జన అనే సాంగ్ ఉంది. ఈ సాంగ్ ను డబ్బింగ్ ఆర్టిస్ట్ బొమ్మాలి రవి పాడటం విశేషం. సిరాశ్రీ రాసిన పాటను బొమ్మాలి రవి పాడాడు. ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియోను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.